
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 13 : మరో 20 ఏండ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టే అధికారంలో ఉంటుందని, అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని 25 వార్డులో వార్డు కౌన్సిలర్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన వార్డు కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రెండుసార్లు సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపిందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు.
పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన వార్డు కమిటీల సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. 25 వార్డు కమిటీ అధ్యక్షుడిగా రుక్మల్చారి, కార్యదర్శిగా కృష్ణచారి, ఉపాధ్యక్షుడిగా వెంకటేశం, సంయుక్త కార్యదర్శిగా మహమ్మద్అలీ, కోశాధికారిగా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా మధుసూదన్‌రెడ్డి, ఎస్ వెంకటేశం, బ్రహ్మచారి, పోద్దార్ నరేందర్, సారంగపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
యువత కమిటీ అధ్యక్షుడిగా ఎండీ ఆసన్, కార్యదర్శిగా శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిగా రమణ, కోశాధికారిగా సాయిరాం, ప్రచార కార్యదర్శిగా రతన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా విశ్వేశ్వర్, వినయ్‌యాదవ్, సంతోష్ ఎన్నికయ్యారు. విద్యార్థి కమిటీ అధ్యక్షుడిగా ఎండి గాయజ్, కార్యదర్శిగా ప్రణీత్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా ఫాజీల్, సంయుక్త కార్యదర్శిగా అకిల్ రామవత్, కోశాధికారిగా నికిల్‌కుమార్, ప్రచార కార్యదర్శిగా ఎండీ అమీర్, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మణ్, అబ్దుల్ సజ్జీ, ఓవేస్లు ఎన్నికయ్యారు.
మైనారిటీ కమిటీ అద్యక్షుడిగా అబ్దుల్ గఫార్, కార్యదర్శిగా రహీం, సంయుక్త కార్యదర్శిగా సయ్యద్ సహెద్, కోశాధికారిగా సయ్యద్ ఖలిమొద్దిన్, ప్రచార కార్యదర్శిగా రషీద్‌అలీ న్నికయ్యారు. మహిళా కమిటీ అధ్యక్షురాలుగా దౌలత్బేగం, కార్యదర్శిగా షాహిన్ సుల్తానా, సంయుక్త కార్యదర్శిగా రామవత్ తులసి, కోశాధికారిగా తపసుమ్, ప్రచార కార్యదర్శిగా రిజ్వన బేగం ఎన్నికయ్యారు. బీసీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా కనకచారి, బట్టి రఘులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగాఎన్నికైన కమిటీల అధ్యక్షులను పూలమాలలతో సన్మానించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ, అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, నాయకులు శంకర్‌గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.