శివ్వంపేట, డిసెంబర్ 14 : నర్సాపూర్ నియోజకవర్గంలో తండాల అభివృద్ధికి రూ. 69.41 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని గిరిజన సంక్షేమ సంఘం నర్సాపూర్ తాలుకా అధ్యక్షుడు సూర్యంచౌహాన్ అన్నారు. బుధవారం శివ్వంపేటలో ఆయన మా ట్లాడుతూ.. తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించడం తోపాటు వాటి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
గిరిజనుల అభివృద్ధికి 10శాతం రిజర్వేషన్ ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు తామంతా రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో తండాల సమన్వయకర్త గేమ్సింగ్నాయక్, నాయకులు సురేశ్‌నాయక్, బద్దునాయక్, విఠల్‌నాయక్, బాల్‌సింగ్‌నాయక్, విఠల్చౌహాన్, గబ్బర్సింగ్చౌహాన్, హరిసింగ్‌నాయక్, శ్రీనివాస్‌నాయక్ పాల్గొన్నారు.