పారిశ్రామికవాడల్లో మత్తు కిక్కు!
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలు డ్రగ్స్, గంజాయికి కేంద్రాలుగా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా, బీహార్, ఏపీ తదితర రాష్ర్టాల నుంచి రైలు మార్గం ద్వారా ఎండు గంజాయిని, డ్రగ్స్‌ను తెచ్చి పారిశ్రామికవాడల్లో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్న ఘటనలన్నీ ఇలాంటివే.
- ఉపాధి మాటున ఇతర రాష్ర్టాల నుంచి గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు
- పారిశ్రామికవాడల నుంచి గ్రామాలకు చేరుతున్న సరుకు
- గంజాయి మత్తులో యువత
- అధికారులు దాడులు చేస్తున్నా ఆగని అక్రమ రవాణా
- ఇతర రాష్ర్టాల కార్మికులే సరఫరాదారులు..?
పటాన్చెరు టౌన్, మే 24: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలు డ్రగ్స్, గంజాయికి కేంద్రాలుగా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా ఒడిశా, బీహార్, ఏపీ తదితర రాష్ర్టాల నుంచి రైలు మార్గం ద్వారా ఎండు గంజాయిని, డ్రగ్స్‌ను తెచ్చి పారిశ్రామికవాడల్లో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్న ఘటనలన్నీ ఇలాంటివే. ఇక్కడ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు తమ సొంత రాష్ర్టాలకు వెళ్లి గంజాయి, డ్రగ్స్ తెచ్చి గుట్టుగా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు అమ్ముతున్నారు.
పరిశ్రమల్లో ఉపాధి కంటే కూడా డ్రగ్స్, గంజాయి సరఫరా, అమ్మకాలే ప్రధాన ఆదాయ మార్గం గా ఎంచుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలో పటాన్చెరు పోలీసులు, ఎస్ఓటీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు మూడుసార్లు గంజాయిని సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు. పటాన్చెరు, పాశమైలారం, ఇస్నాపూర్, బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల్లో పనిచేసే బీహార్, ఒడిశా రాష్ర్టాలకు చెందిన కొందరు కార్మికులు గంజాయి, డ్రగ్స్ సరఫరా, అమ్మకాలు చేస్తున్నారు. డబ్బు సంపాదనకు ఇదే సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారు. పరిశ్రమల్లో పనిచేస్తూ తోటి కార్మికులతో పరిచయాలు పెంచుకొని మత్తు పదార్ధాలకు బానిసలు చేస్తున్నారు.
పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి
పారిశ్రామికవాడలు, జాతీయ రహదారులపై గంజాయి రవాణా చేసే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగానే, గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో యువత గంజాయిని పీల్చేందుకు ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారో తెలిసినా, ఎవరికి చెప్పాలో తెలియక నాయకులు, పలువురు యువకులు మనకేందుకులే అని ఊరుకుంటున్నారు. పోలీసులు భరోసా ఇస్తే గంజాయి రవాణా, స్థావరాలు, బానిసలుగా మారిన యువత వివరాలు ఇచ్చేందుకు కొందరు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

ఇటీవల గంజాయి పట్టుబడిన ఘటనలు
- ఇంద్రేశం మున్సిపాలిటీ రామేశ్వరంబండలోని డెయిరీ ఫామ్‌లో పనిచేసే సురేశ్రాయ్ అనే వ్యక్తి బీహారు నుంచి ఎండు గంజాయిని తెచ్చి ఇక్కడ అమ్ముతుండగా ఏప్రిల్ 13న పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
- ఈనెల 9న రుద్రారం పరిధిలోని డోయెన్ కౌంటీ వెంచర్లో బ్రిజేశ్ కుమార్ అనే వ్యక్తి ఎండు గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 1.48 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
- ఈనెల 9న కొల్లూరు మైహోమ్ విపినా లేబర్ క్యాంపు వద్ద చందన్ కుమార్ అనే వ్యక్తిని పట్టుకొని 4.7 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరూ బీహార్ రాష్ర్టానికి చెందిన వారు. స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయి విలువ రూ.3.59 లక్షలు.
- ఈనెల 11న పటాన్చెరు పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 3 వద్ద కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు, పటాన్చెరు పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 400 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి షోలాపూర్ వైపు డీసీఎంలో తరలిస్తుండగా, ఓఆర్ఆర్ వద్ద పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న నాలుగు క్వింటాళ్ల ఎండు గంజా యి విలువ దాదాపు రూ.4 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
గంజాయి మత్తులో యువత
పారిశ్రామికవాడల్లో గుట్టుగా లభించే గంజాయి ఇప్పుడు గ్రామాలకు చేరింది. పటాన్చెరు నియోజకవర్గంలోని దాదాపు ప్రతి గ్రామంలో కొందరు యువత గంజాయి మత్తుకు వ్యసనం అయ్యారు. వీరికి గంజాయి రవాణా చేసే వ్యక్తులు, ఎక్కడ దొరుకుతుందో తెలుసు. సిగరేట్లలో గంజాయిని నింపి హుక్కాలాగా పీలుస్తున్నారు. మరికొందరు పది రూపాయల కూల్‌డ్రింక్ బాటిల్ కొని, అందులోని లిక్విడ్ తాగేసి బాటిల్‌కు హోల్ చేసి రీఫిల్ తీసేసిన పెన్ను పెడుతున్నారు.
బాటిల్లో గంజాయిని నిం పి పీలుస్తున్నారు. జనసంచారం లేని ప్రాంతాలు ఎంచుకొని గుంపులుగా మత్తులో జోగుతున్నారు. కొందరు యువత గంజాయి మత్తును ఎంజాయ్ చేస్తూ అర్ధరాత్రి దాటినా ఇండ్లకు రావడం లేదు. ఆలస్యమైందని తల్లిదండ్రులు అడిగితే వారి మీదికి తిరగబడుతున్నారు. పిల్లల సంగతి తెలిసిన తల్లిదండ్రులు తెలియనట్లు ఉంటున్నారు. అడిగితే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో అన్న భయంతో వారు మిన్నుకుంటున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

