వర్గల్, మార్చి 20 : నాచగిరి లక్ష్మీనరసింహస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి పర్యవేక్షణలో శ్రీసూక్తరుద్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శుక్రవారం రాత్రి 10గంటలకు లక్ష్మీసమేత నరసింహస్వామి కల్యాణం జరుగుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రత్యేకంగా సిద్ధం చేసిన కల్యాణ మండపం వద్దకు దేవతామూర్తులను భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల మధ్య తీసుకువస్తారు. శ్రీసూక్తరుద్రపాయణంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.