మెదక్ మున్సిపాలిటీ/ హవేళీఘనపూర్/ తూప్రాన్/ కొల్చారం, జనవరి 21 : కంటి వెలుగు కార్యక్రమం జిల్లా కేంద్రం మెదక్‌లో మూడో రోజు శనివారం 22వ వార్డులో నిర్వహించారు. బస్తీ దవాఖాన వైద్యుడు మణికంఠ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. 123 మందిని పరీక్షించగా, 63 మంది కంటి అద్దాలను అందజేసినట్లు తెలిపారు.
అంధత్వ నివారణ కోసమే : జడ్పీటీసీ సుజాత
హవేళీఘనపూర్ మండలంలోని లింగ్సాన్‌పల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని జడ్పీటీసీ సుజాత పరిశీలించారు. అంధత్వ నివారణ కోసమే ప్రభుత్వం కంటి వెలుగు శిబిరా లను నిర్వహిస్తున్నదని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
లింగ్సాన్పల్లిలో డీఆర్డీవో శ్రీనివాసరావు తనిఖీ
హవేళీఘనపూర్ మండలం లింగ్సాన్పల్లిలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని డీఆర్డీవో శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అవసరమైన అద్దాలను అందించాలని కంటి వెలుగు సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీరామ్, ఎంపీవో ప్రవీణ్, సర్పంచ్ రమేశ్, వైద్యాధికారి వినయ్ పాల్గొన్నారు.
విజయవంతంగా కంటివెలుగు పరీక్షలు
తూప్రాన్ పట్టణంలో రెండో విడత ‘కంటివెలుగు’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. తూప్రాన్ మున్సిపల్లోని 4వ వార్డులోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం, 12వ వార్డులో కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. కంటి వెలుగు గొప్ప కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రజలందరూ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకో వాలని సూచించారు. కంటి వెలుగు శిబిరంలో ఉచిత కంటి పరీక్షలతోపాటు, అద్దాలు, మందులను ప్రభుత్వమే ఉచితం గా ఇస్తుందన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు. శనివారం 158 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 75 మందికి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మీబాయి నర్సోజీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనందర్, మండల వైద్యాధికారి జ్యోత్నాదేవి, నర్సయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
దృష్టిలోపం ఉన్నవారికి వరం : సర్పంచ్ కిష్టయ్య
కొల్చారం మండలంలోని వెంకటాపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రమేశ్ తో కలిసి సర్పంచ్ కిష్టయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దృష్టిలోపంతో బాధపడు తున్నవారికి కంటి వెలుగు శిబిరాలు వరమన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్యలక్ష్మీసిద్ధిరాములు పాల్గొన్నారు.