సిద్దిపేట జిల్లాలో తీవ్రమైన యూరియా కొరత నెలకొంది. అన్నదాతలు ఎరువుల దుకాణాల వద్ద వేకువజామున నుంచే బారులు తీరుతున్నారు. క్యూలో గంటల పాటు నిలుచున్నా యూరియా దొరక్క పోవడంతో రైతులు ఆవేదనతో రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. బస్తా యూరియా దొరకడం గగనంగా మారడంతో ఇంటల్లి పాది రైతు కుటుంబాలు తరలివచ్చి ఎరువుల దుకాణాలు, ఫర్టిలైజర్ షాపులు, సింగిల్ విండో సొసైటీల వద్ద లైన్ కడుతున్నారు.
పోలీసుల పహారాలో యూరియా పంపిణీ జరుగుతున్నది. యూరియా దొరకని రైతులు కడుపుమండి కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడంతో తమకు యూరియా కష్టాలు దాపురించాయని రైతులు వాపోతున్నారు. ఎక్కడ చూసినా యూరియా వెతలే నెలకొన్నాయి.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 20