తూప్రాన్: ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై పడి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మొదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన మాచిరెడ్డి సాయి రామ్ రెడ్డి (27) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై శవంగా కనిపించాడు. అతడు పల్సర్ బైక్ పై వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది.
ఘటనా ప్రదేశంలో కాటన్ మద్యం సీసాలు ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయిరామ్ రెడ్డి ని ఎవరో హత్య చేసి పట్టాలపై పడేసి ఉంటారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.