సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కదం తొక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. రైతుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు ఉపాధిని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలు కట్టలేక, ఫైనాన్స్ ద్వారా తెచ్చిన ఆటోలకు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేక ఆటో డ్రైవర్ల జీవతం దుర్భరంగా మారిందన్నారు. ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.