కాంగ్రెస్ నాయకుల నీచ రాజకీయాలు
కాంగ్రెస్ నాయకులు నీచరాజకీయాలకు పాల్పడుతూ పేదలకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో గురువారం ఆమె ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వడానికి రాగా ఎంపీడీవో శంకర్ మంజూరుపత్రాలు ఇవ్వడానికి నిరాకరించారు.
- ఇండ్ల మంజూరు పత్రాలు ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదు
- ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజం
హత్నూర, మే 7: కాంగ్రెస్ నాయకులు నీచరాజకీయాలకు పాల్పడుతూ పేదలకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో గురువారం ఆమె ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వడానికి రాగా ఎంపీడీవో శంకర్ మంజూరుపత్రాలు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో మంజూరు పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని, ముందుగా మీరు చెప్పితేనే గ్రామాల నుంచి లబ్ధిదారులను తీసుకువచ్చామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మంజూరుపత్రాలు ఇవ్వాలని ఎంతచెప్పినా నిరాకరించడంతో ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్ నాయకులు రైతువేదిక వద్ద నేలపైకూర్చొని నిరసన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తోపాటు గృహనిర్మాణశాఖ పీడీతో సెల్ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇప్పించాలని కోరారు. అరగంటపాటు వేచిచూసిన ఎమ్మెల్యే అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుచెప్పారు. గతంలో కల్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే కావడంతోనే అడుగడుగునా ప్రతి కార్యక్రమానికి అడ్డుచెబుతున్నారని ఆమె ఆరోపించారు. ఎక్కడ ధర్నాచేయాలో, ఎక్కడ నిలదీయాలో తెలుసని, అక్కడే ప్రభుత్వా న్ని ప్రశ్నిస్తానని అక్కడి నుంచి బీఆర్ఎస్ నాయ కులతో కలిసి ఆమె వెళ్లిపోయారు. ఈ కార్యక్రమ ంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, సర్పంచ్‌లు నవీన్‌గౌడ్, మల్లేశం, శోభారాణి, నాయకులు నర్సింహారెడ్డి, శ్రీకాంత్, సుధాకర్, నరేందర్, రాజు, శ్రీకాంత్‌గౌడ్, మన్నెరమేశ్, సత్యనారాయణ, మధు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

