కంది/ పెద్దశంకరంపేట, అక్టోబర్ 1 : రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. కంది మండలం బేగంపేట సర్పంచ్ రాజేందర్‌నాయక్, వార్డు సభ్యులతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం చింతా ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పార్టీలకు అతీతం గా అర్హులందరూ లబ్ధిపొందుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్, ఆసరా ఫించన్లు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్తోపా టు గృహలక్ష్మి పథకాలు అర్హులైన ప్రతి ఇంటికీ చేరుతున్నాయ ని తెలిపారు.
ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న మహానీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావ..
వచ్చే ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. కల్లిబొల్లి మాటలను ప్రజలు నమ్మొద్దని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారంటీ హామీలు అసత్య హామీలని, వాటిని అమలు చేయలేరన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటి హామీలు ఇచ్చి, ఇప్పుడు అక్కడి ప్రజల ను మోసం చేసిందని విమర్శించారు.
65 ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధిని కేవలం పదేండ్లలో చేసి చూపించిన ఘన త బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. వచ్చే ఎన్నికల్లో అరచేతిలో వైభోగం చూపించే కాంగ్రెస్ యత్నాలను తిప్పికొట్టాలన్నారు. గత ఎన్నికల్లో మాయమాటలు నమ్మి సంగారెడ్డి ఎమ్మెల్యేను గెలిపిస్తే ఒక్కరోజైనా ప్రజల మధ్యకు వచ్చాడా? అని ప్రశ్నించాడు. మళ్లీ ఎన్నికలు వస్తున్నందున ప్రజలు మరోసారి మోసపోవద్దని, జరిగిన, జరగనున్న అభివృద్ధిని ఆలోచించి బీఆర్ఎస్కు అండగా నిలవాలని చింతా ప్రభాకర్ కోరారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చేర్యాల ప్రభాకర్, బీఆర్ఎస్ కంది మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ చెంద్రి శ్రీనివాస్, నాయకులు సాయిగౌడ్, పుల్లారెడ్డి, నర్సింహగౌడ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన రాఘవానితండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు
నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమక్షంలో పెద్దశంకరంపేట మండలం రాఘవానితండాకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీల నాయకుల బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలను గుర్తించి, జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పంచ్ సుభాశ్, నాయకులు లక్ష్మణ్‌నాయక్, నెహ్రూనాయక్, రమేశ్ నాయక్, రంజిత్‌నాయక్, బాబీనాయక్ పాల్గొన్నారు.