శివ్వంపేట, మార్చి 13: ప్రజల వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ప్రారంభించిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గోమారంలో పల్లె దవాఖానను వారు సర్పంచ్ లావణ్యామాధవరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల ఆరోగ్య మహిళా క్లీనిక్‌ను ప్రారంభించుకున్నామని, మహిళలందరూ ప్రతి మంగళవారం ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, జడ్పీ కోఆప్షన్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైడి శ్రీధర్‌గుప్తా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, స్థానిక ఎంపీటీసీ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేశం, కోఆప్షన్ లాయక్, మండల కోశాధికారి బండారి గంగాదర్, ఇన్చార్జి ఎంపీడీవో తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ కాముని శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.