రామాయంపేట, జనవరి 12 : మెదక్ జిల్లాలోని రామాయంపేట, నిజాంపేట మండలాల్లో భారీగా మంచు కురిసింది. మంచు తెరలు మధ్యాహ్నం వరకు కూడా తొలగలేదు. బుధవారం మొత్తం రెండు మండలాలు మధ్యాహ్నం వరకు మంచు గుప్పిట్లోనే ఉన్నాయి.
దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చలికి వణుకుతూనే ప్రయాణాలు చేశారు. వ్యాపార లావాదేవీలు కూడా మంచు మూలంగా అంతంత మాత్రమే నడిచాయి.
వాహనదారులు మధ్యాహ్నం పూట కూడా లైట్లు వేసుకొని ప్రయాణాలు చేశౠరు. మూడు గంటల ప్రాంతంలో భానుడు కనిపించడంతో చలి కనిపించకుండా పోయింది. వ్యాపారాలు సజావుగా సాగాయి.