పాపన్నపేట,జూన్26 : ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.