రామాయంపేట, ఏప్రిల్ 30 : వేసవి నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. మూగజీవాల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. అడవిలోని మూగజీవాల దప్పిక తీర్చడానికి అటవీశాఖ ప్రత్యేక ఏర్పాటు చేసింది. వేసవి కాలంలో వన్యప్రా ణుల దాహార్తి తీర్చడానికి సాసర్ పిట్లు, సోలార్ పంపులు, వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. మూగజీవాలకు ఆహా రం కల్పించడంతోపాటు దప్పిక తీర్చడానికి అనేక నిర్మాణా లు చేపట్టారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలను నివారించడానికి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రామాయంపేట అటవీ ప్రాంతంలో ఐదు మండలాలు (చేగుంట, నార్సింగి, నిజాంపేట, చిన్నశంకరంపేట) ఉన్నాయి. అటవీప్రాంతంలో అడవి జంతువులకు చెట్ల మధ్యలో సాసర్ పిట్లను నిర్మించి, దప్పిక తీరుస్తున్నారు.
అటవీశాఖ సిబ్బంది ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అడవిలోకి వెళ్లి జంతువుల కోసం నిర్మించిన 98 సాసర్ పిట్లలో నీళ్లను నింపుతున్నారు. ఇందు కోసం కూలీలు, సిబ్బందిని నియమించారు. సాసర్ పిట్లలోని నీళ్లను వన్యప్రాణులు తాగి వెళ్లి పోతున్నాయి. బీట్ పరిధిలోని ఫారెస్టు బీట్ అధికారితోపాటు ఉపాధి కూలీలు ప్రతిరోజూ సాసర్ పిట్లలో నీళ్లను పట్టిస్త్తున్నారు. అడవిలో నాటిన మొక్కలకు కూలీల ద్వారా నీళ్లు పట్టిసున్నారు. అడవిని కాపాడడమే తమ ముఖ్య లక్ష్యమని, అడవిలో సీసీ కెమెరాలు పెట్టి జంతువుల ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. సాసర్ పిట్ల దగ్గర ఎలాంటి జంతువుల కదలికలు వచ్చిన వెంటనే రామాయంపేట అటవీశాఖ కార్యాలయంలో సైరన్ మోగుతుంది. దీంతో అటవీ ప్రాంతాల్లో పని చేసే కూలీలను జంతువులు ఉన్న ప్రదేశానికి వెళ్లవద్దంటూ హెచ్చరికలు చేస్తూ పనులను చేయిస్తున్నారు.
రామాయంపేట అటవీప్రాంతం పరిధిలో నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నారు. తద్వారా వన్యప్రా ణులకు నీటిని అందుబాటులో ఉంచుతున్నారు. దీంతోపాటు చెక్‌డ్యాం నుంచి సోలార్ ద్వారా పంపుసెట్లకు కనెక్షన్ ఇచ్చి సాసర్ పిట్లలోకి నేరుగా నీటిని నింపుతున్నారు. సోలార్ స్తం భాలకు అమర్చిన సీసీ కెమెరాల సాయంతో అటవీశాఖ అధి కారులు ఎప్పటికప్పుడు వన్యప్రాణుల సమాచారిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఫారెస్టు అధికారులు అవగాహన సమావే శాలు నిర్వహిస్తున్నారు. అటవీ సంపదనను కాపాడాలని, అడవిలో అగ్నిప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసు కోవా లని సూచిస్తున్నారు. మైదాన ప్రాంత ప్రజలు అడవిలోకి వెళ్ల కుండా హెచ్చరికలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రామాయంపేట పరిధిలోని ఐదు మండలాలతో మొత్తం 10200 హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించింది.
Medak4
అగ్ని ప్రమాదాలు జరుగకుండా చర్యలు
అటవీప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా సమగ్ర చర్యలు చేపడుతు న్నాం. పశువులను మేతకు తీసుకువెళ్లే రైతులు అగ్గిపెట్టెలు తీసుకెళ్లకుండా తని ఖీ చేస్తున్నాం. అగ్గిపెట్టెలు ఉంటే వెనక్కి పంపిస్తున్నాము. వేసవి కావడంతో ఎండ తీవ్రత అధికం గా ఉండడంతో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నా యి. దీంతో అటవీప్రాంత ప్రజలకు అడవిని కాపాడాలని హెచ్చరికలు చేస్తున్నాం. అక్కన్నపేట, పర్వతాపూర్, దంతెపల్లి ప్రజలకు అటవీ సంపద కాపాడాలని అవగాహన కల్పిస్తున్నాం.
– రాము, అక్కన్నపేట బీట్ ఆఫీసర్
అడవిలోకి ప్రజలు వెళ్లకుండా చర్యలు
అటవీప్రాంతంలో కలప కోసం రైతులు, ప్రజలు వెళ్లకుండా చర్యలు చేపడుతున్నాం. అటవీప్రాంతం పరిధి చుట్టూరా జేసీబీలతో గుంతలు తీయించి ఎవరూ వెళ్లకుండా పటి ష్ట చర్యలను చేపడుతున్నాం. అక్కన్నపేటలో నర్సరీ ఏర్పాటు చేసి, పండ్లు, ఇతర మొక్కలు పెంచు తు న్నాం. రామాయంపేటతోపాటు జిల్లాస్థాయి అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అడవి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం అడవుల పరిరక్షణపై పటిష్టమైన చర్యలు చేపట్టడం తో అటవీప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– కుత్బుద్దీన్, డిప్యూటీ ఎఫ్ఆర్వో
అడవిని కాపాడడమే లక్ష్యం
రామాయంపేట మండలంలోని అటవీ సంపద అన్యాక్రాంతం కాకుం డా కాపాడుతాం. అటవీశాఖ విస్తీర్ణం 10200 హెక్టార్లలో ఉంది. అటవీ ప్రాంతాల్లోని మైదానప్రాంత ప్రజలు రాకుండా బీట్ అధికారులతో ప్రతి రోజు ప్రత్యేక తనిఖీలు చేయిస్తున్నాం. అడవిలో ఉన్న మూగజీవాల దాహార్తి తీర్చడంతోపాటు చెట్లకు ప్రతిరోజూ ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోస్తున్నాం. రామా యంపేట అటవీప్రాంతంలో తిరిగే జంతువులను సీసీకెమెరాల్లో చూస్త్తూ లెక్కిస్తూ ఫొటోలు తీస్తున్నాం.
– విద్యాసాగర్, రామాయంపేట ఎఫ్ఆర్వో