సిద్దిపేట, నవంబర్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1613 గ్రామ పంచాయతీలు, 14,098 వార్డులు ఉన్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 27న ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసి, ఆ రోజు నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఏదైనా కారణాలతో ఆగిపోతే ఉప సర్పంచ్ ఎన్నికను తర్వాత చేపడుతారు. రెండేండ్లుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి కుంటిపడింది. పాలన అస్తవ్యస్తంగా మారడంతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1613 జీపీలు
సిద్దిపేట జిల్లాలో 508జీపీలు, 4,508 వార్డులు, మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు, సంగారెడ్డి జిల్లాలో 633 జీపీలు 5,558 వార్డులు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో సిద్దిపేట జిల్లాలో 163 పంచాయతీలు, 1432 వార్డులు, మెదక్ జిల్లాలో 160 జీపీలు, 1402 వార్డులు, సంగారెడ్డి జిల్లాలో 136 జీపీలు 1246 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ ఇలా…
తొలి విడత
రెండో విడత
మూడో విడత

