ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఘనత బీఆర్ఎస్దే
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పట్టుదలతోనే నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో దేశంలోనే అతిపెద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ ఫ్లెక్సీకి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.
- కేసీఆర్ కృషితోనే నర్మెటలో నిర్మాణం
- బీఆర్ఎస్ నాయకుల వెల్లడి
- గులాబీ అధినేత కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకాలు
హుస్నాబాద్, మార్చి 22: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పట్టుదలతోనే నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో దేశంలోనే అతిపెద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ ఫ్లెక్సీకి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ లాభాలు ఇచ్చే ఆయిల్‌పామ్ పంట సాగును ప్రోత్సహించి ఇక్కడి రైతులకు ఫ్యాక్టరీని అందుబాటులోని తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మొత్తం పూర్తయిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేసి తన ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, మాజీ జడ్పీటీసీ బీలూనాయక్, కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, గడిపె సతీశ్, నాయకులు పరశురామ్, రామకృష్ణ, కొంకట రవి, ఇంద్రాల సారయ్య, యాస శ్రీనివాస్, చిదురాల శ్రీను, వికాస్‌యాదవ్, జీవన్, నర్సింహారెడ్డి, డి. శ్రీనివాస్, అరవింద్‌గౌడ్, బూర వెంకన్న, కనుకయ్య, తిరుపతినాయక్, పూదరి రవీందర్, రాజు
నారాయణరావుపేటలో…
నారాయణరావుపేట, మార్చి 22 మండల కేంద్రంలో ఆదివారం కేసీఆర్, హరీశ్‌రావు ఫ్లెక్సీకి బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్, హరీశ్‌రావు చొరవతో నంగునూరు మం డలం నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఫ్యాక్టరీ ప్రారంభించడానికి వచ్చాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పాలిట రేవంత్‌రెడ్డి శాపంగా మారాడన్నారు. రైతులకు తక్షణమే రెండు లక్షల పంట రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
నంగునూరులో…
సిద్దిపేట,మార్చి 22: నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మించిన ఘనత కేసీఆర్, హరీశ్‌రావుకే దక్కిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆదివారం నంగునూరులోని పామాయిల్ తోటలో బీఆర్ఎస్ నాయకుడు చింటుగౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్, హరీశ్‌రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఇమ్రాన్, పరశురాములు, రాజురెడ్డి, సోహెల్, చిన్న, చందు, అభిషేక్ పాల్గొన్నారు. నర్మెటలో కేసీఆర్, హరీశ్‌రావు చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- BRS
- oil palm
- oil palm factory
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

