రేగోడ్, ఫిబ్రవరి 11 : మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో శనివారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ జార్జి ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 36 మంది పోలీసులతో ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా పోలీసులు మొత్తం 150 ఇండ్లల్లో తనిఖీలు పూర్తి చేశారు. సరైన ధ్రువ పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక కారు మొత్తం 25 వాహనాలను స్వాధీనం చేసుకుని, పోలీస్‌స్టేషన్ కు తరలించారు. సంబంధిత వాహనాల యజమానులు ధ్రు వపత్రాలను పోలీస్‌స్టేషన్‌లో చూపించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా సీఐ జార్జి మాట్లాడు తూ.. ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారన్నారు. నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు భద్రత కల్పించడంలో రాజీ పడేది లేదన్నారు. గ్రా మానికి ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా నేరస్తులు ఆశ్రయం పొం దితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తుల ను కోరారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసు కోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక సీసీకెమెరా 100 మంది పోలీ సులతో సమానమన్నారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్ప డితే కేసు నమోదు చేస్తామన్నారు. యువత మత్తుకు బానిస కావొద్దని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామానికి వస్తే 100 నంబరుకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చినవారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.