మెదక్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక అద్భుతమని, అది కేవలం కేసీఆర్ కృషివల్లనే సాధ్యమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపైన ఇచ్చిన పవర్ ప్రజంటేషన్ను మంగళవారం మెదక్ జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జడ్పీ మాజీ అధ్యక్షురాలు హేమలత శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మాజీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల పార్టీ నాయకులతో వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ..కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం బద్నాం చేస్తున్నదని విమర్శించారు. కాళేశ్వరం ఒక పెద్ద ప్రాజెక్టు అని, అది కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు.
అపర భగీరథుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడని గుర్తుచేశారు. కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఏమీ చేయలేరని, భవిష్యత్తులో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులను కాపాడుకుంటామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్ ప్రజంటేషన్ విన్న నాయకులందరూ గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించాలని పద్మాదేవేందర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, జడ్పీ మాజీ అధ్యక్షురాలు హేమలత శేఖర్ గౌడ్, మాజీ ఉపాధ్యక్షురాలు ఎం.లావణ్యరెడ్డి, మెదక్, రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున గౌడ్, పల్లె జితేందర్ గౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీల ఫోరం మాజీ అధ్యక్షుడు హరికృష్ణ, హవేలీ ఘనపూర్, చిన్నశంకరంపేట్, నిజాంపేట్ మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పట్లోరి రాజు, సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, భీమరి కిశోర్, విజయలక్ష్మి, పట్టణ పార్టీ కో కన్వీనర్లు లింగారెడ్డి, జుబేర్ అహ్మద్, కండెల సాయిలు, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలోని మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైతు మహాధర్నాను విజయవంతం చేయాలి
మెదక్ కలెక్టరేట్ ఎదుట ఈనెల 7న రైతు మహాధర్నా చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. మెదక్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించే స్థలాన్ని మంగళవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ హేమలతా శేఖర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రె స్ ప్రభుత్వం పంట రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదన్నారు. రైతుభరోసా పంపిణీ ఇంకా పూర్తి అందించలేదని, దీనికి నిరసనగా రైతులతో కలిసి రైతు మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ధర్నాకు రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాజీ కౌన్సిలర్లు ఆరే శ్రీనివాస్, జయరాజు, చిన్నశంకరంపేట బీఆర్ఎస్ అధ్యక్షుడు పట్లూరి రాజు, గ్రంథాలయ సం స్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, నాయకులు ప్రభురెడ్డి, ఏనుగులరాజు, కండెల. సాయి లు, శంకర్, జుబేర్ అహ్మద్, మోహన్ నాయక్, నగేశ్, పోచయ్య, రవి కిర ణ్, భువన్ పాల్గొన్నారు.