వర్గల్, జూన్ 21: హరితహారంపై గొడ్డలి వేటు పడింది. పచ్చదనమే ప్రగతికి మెట్టు అన్న లక్ష్యంతో బీఆర్ఎస్ హ యాంలో హరితహారంలో నాటిన మొ క్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. ఇప్పుడు ఆ చెట్లకు కరెంట్ లైన్లు శాపంగా మారి గొడ్డలి వేటు కు బలవుతున్నాయి.

వర్గల్ మండలంలోని శాకారం-తున్కిఖల్సా గ్రామాల మధ్య డూపాయింట్ కంపెనీ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లను విద్యుత్ అధికారులు వైర్లకు అడ్డుగా వస్తున్నాయని నరికి వేయడంతో రోడ్డు కళాహీనంగా కనిపిస్తుంది.