సిద్దిపేట అర్బన్, మే 9: ‘మనఊరు-మనబడి’ పను ల్లో వేగం పెంచి, ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవర్గంలో ‘మనఊరు-మనబడి’ పథకం కింద పాఠశాలల్లో చేపట్టిన పనులపై ఎం ఈవోలు, ఎంపీడీవో, ఎంపీవో, ఇంజినీరింగ్ విభాగం, ఈఈ, డీఈ, ఏఈ, నిర్మాణ ఏజెన్సీలు, సర్పంచ్‌లతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు ఆదేశానుసారం ఈ నెల చివరి కల్లా పనులు పూర్తి చేయాలన్నారు.
ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్, మైనర్ రిపేర్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని, ఈజీఎస్ కింద చేపట్టిన టాయిలెట్లు, కిచెన్‌షెడ్ పనులు త్వరగా పూర్తిచేసి, కలరింగ్ వేయాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు ఈజీఎస్ పనులను పర్యవేక్షణ చేయాలన్నారు. ఏఈలు ఇప్పటివరకు పూర్తయిన పనులకు ఎఫ్టీఓ జనరేట్ చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, పం చాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.