జగదేవ్‌పూర్, నవంబర్ 22: సిద్దిపేట జిల్లా తీగుల్ నర్సాపూర్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ అమ్మవారి 23వ ఆలయ వార్షికోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు వేదమంత్రోచ్ఛరణల మధ్య శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
పూర్ణాహుతి, అన్న ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శివపార్వతుల కల్యాణోత్సవంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రజితారమేశ్, యాదవరెడ్డి, మచ్చేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కవిత, ఈవో రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.