కొండాపూర్, ఏప్రిల్ 15 : సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచి కానున్నారని తెలంగాణ హ్యండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి-సీహెచ్ గోప్లా రం గ్రామాల మధ్యన కొన్ని సంవత్సరాల క్రితం చెరువుకట్ట వరదకు కొట్టుకుపోయింది. రూ.45 లక్షల వ్యయంతో చెరువుకట్ట మ రమ్మతులకు శనివారం చైర్మన్ చింతా ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. తేర్పోల్ మధిర గ్రామం ఎదురుగూడెం గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం కొండాపూర్ మండలకేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు కట్ట నిర్మాణంతో ప్రజల ఇబ్బందులు తీరుతాయన్నా రు. చెరువు కట్ట పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కొండాపూర్ మండలాభివృద్ధికి నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతగా తెలిపారు. కార్యక్రమం లో డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, జడ్పీటీసీ పద్మావతీపాండురంగం, తహసీల్దార్ ఆశాజ్యోతి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచందర్, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, మండలాధ్యక్షుడు విఠల్, రైతుబంధు మడలాధ్యక్షుడు మల్లేశం, సొసైటీ చైర్మన్లు శ్రీకాంత్‌రెడ్డి, రాజు, పవన్, సర్పంచ్‌లు రుక్ముద్దీన్, శివలీలాజగదీశ్వర్, ప్రకాశం, నర్సింహులు, షఫీ, మౌనిక, హేమలతాఅరవింద్రెడ్డి, మాజీ స ర్పంచ్‌లు సత్యానందం, గోవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు విజయభాస్కర్‌రెడ్డి, రాందాస్, ఉపసర్పంచ్ రామప్ప, నాయకులు మల్లాగౌడ్, నగేశ్, ప్రభాకర్, మోహన్‌గౌడ్, శ్యాంరావు, నాగయ్య, రవి, గురుకిరణ్, జలీల్ ఉన్నారు.