పటాన్చెరు, నవంబర్ 5 : 65వ జాతీ య రహదారిపై ముత్తంగి వద్ద కారును తప్పించబోయి డివైడర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బుధవారం పటాన్చెరు నుంచి ఇస్నాపూర్‌కు వస్తున్న హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మేడ్చల్ నుంచి ఇస్నాపూర్‌కు బస్సు వస్తుండగా, ముత్తంగిలో ఓ హోటల్ ముందు కార్లు నిలిపి ఉం డడం, కారును తప్పించబోయి ఆర్టీసీ బ స్సు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ స్తంభాన్ని బస్సు ఢీకొట్టడంతో అక్కడే ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్పగాయాల య్యాయి. బస్సులో ఉన్న వారం తా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో బ స్సు ఇంజిన్ డ్యామేజ్ అయ్యింది. డివైడర్ ను ఢీకొన్న బస్సును పోలీసులు క్రేన్ సహాయంతో పక్కకు తొలిగించారు. ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపుతుండడం తో ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేపై వాహనాలు నిలపకుండా పోలీసులు చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.