తెలంగాణ అవతరణ పండుగను మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఊరూవాడా, పల్లె పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. నియోజకవర్గం, మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు,నాయకులు వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రతీచోటా జై తెలంగాణ, జయహో తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి.
– సిద్దిపేట, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నర్సాపూర్, జూన్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని, గులాబీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేద్దామని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండాలను ఆమె ఎగురవేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ కేసీఆర్ ప్రాణా న్ని ఫణంగా పెట్టి సాధించిన రాష్ట్రంలో ఇతరుల పెత్తనం కొనసాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నహీం, మాజీ ఎంపీటీసీ సత్యంగౌడ్, సీనియర్ నాయకులు శివకుమార్, మన్సూర్, హుస్సేన్, బాల్‌రెడ్డి, ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గజ్వేల్, జూన్ 2: కేసీఆర్ సంకల్ప బలంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళ వారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడారు.
స్వరాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ముందు వరుసలో పెట్టారని, మహాత్మాగాంధీ కలలను సాకారం చేసి గ్రామ స్వరాజ్యం చేశారన్నారు. పదేండ్లలో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచి ప్రాజెక్టులు నిర్మించి కొద్ది కాలంలోనే సాగునీళ్లు అందించిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. ఆనాడు కేసీఆర్ ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని, ఎంతో మంది విద్యార్థులు, యువత బలిదానాలతో రాష్ట్రం సాధించుకున్నామన్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణంతో దేశంలోనే తెలంగాణ అత్యధికంగా పంటలు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా మార్చారన్నారు. దేశంలో ఏరాష్ట్రంలోలేని సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి గడపకూ అందేలా కేసీఆర్ విజన్‌తో ముందుకెళ్లారన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ చందనారవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయినర్సింగరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దుబ్బాక, జూన్ 2: గులాబీ అధినేత కేసీఆర్‌తోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం కేవలం పరిపాలన విభజన మాత్రమే కాదని, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని గుర్తు చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, వంద పడకల దవాఖాన, గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, తాగ్యాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శం గా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సమైక్యాంధ్ర పాలకుల నిరంకుశ పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలకు పరిపాలన సౌలభ్యంతో పాటు స్వేచ్ఛావాయువులు అం దించిన ఘనత ఉద్యమనేత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలుపెరగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధ్యపడిందని, చివరకు తన ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారని గుర్తుచేశారు.
ఉద్యమాలకు మారుపేరుగా నిలిచిన దుబ్బాక గడ్డ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు.రాష్ట్ర సాధనలోఅమరుల త్యాగం మర్చిపోలేనిదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే…రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దుర్భిక్షంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ సృష్టిస్తే… ఆ పథకాలను కోతపెట్టే పనిలో రేవంత్ సర్కార్ పని చేస్తుందని మండిపడ్డారు.
రైతులకు సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు కేసీఆర్ మల్లన్నసాగర్ నిర్మించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం పండించిన ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలంతా చూస్తున్నారని, ఆ పార్టీని భూస్థాపితం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతారవీందర్, వైస్ చైర్‌ర్సన్ ఆస సులోచనాస్వామి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, ఎల్లారెడ్డి, యాదగిరి, శ్రీనివాస్, రాజు, కైలాస్, మధు, పండు పాల్గొన్నారు.
హుస్నాబాద్, జూన్ 2: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నో వాగ్దానాలు చేసిందని, తీరా అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ విమర్శించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చకుంటే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ఆయ న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, కనీసం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలనైనా నిలబెట్టుకోవాలన్నారు. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం, కేసీఆర్ లాంటి తెలంగాణ వాదుల పోరాటం, ప్రజల ఐక్య ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర సిద్ధించిందన్నారు. 1969 నుంచి 2014వరకు వందలాది మంది ప్రాణత్యాగం చేశారన్నారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో మొదలైన ఉద్యమం రాష్ట్రం సాధించే వరకు కొనసాగిందని చెప్పారు. 2009డిసెంబర్లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడం వల్లనే ప్రాణనష్టం జరిగిందన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల కుటుంబాలకు రూ.10లక్షల నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే చెందుతుందన్నారు. పదేండ్లలో రాష్ర్టాన్ని కేసీఆర్ దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. త్వరలోనే సభ్యత్వ నమోదు ప్రారంభించి గ్రామాలు, పట్టణాల్లో గడపగడపకూ తిరుగుతామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.