సంగారెడ్డి. ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. ఊరూవాడ గులాబీజెండా రెపరెపలాడింది. ఆదివారం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు తమ ప్రాంతాల్లో జెండాలు ఎగురవేశారు.బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ‘జై తెలంగాణ..జై కేసీఆర్’ అంటూ నినదించారు. రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభకు జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులు, యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా వరంగల్ సభకు జిల్లా నుంచి వెళ్లారు. వరంగల్ వెళ్లే పార్టీ శ్రేణుల వాహనాలతో జిల్లాలోని ప్రధాన రహదారులపై సందడి నెలకొంది.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎల్కతుర్తి వెళ్లే వాహనాలకు ఆయన జెండా ఊపారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, బీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, మామిళ్ల రాజేందర్, డా.శ్రీహరి, లక్ష్మీ తదితరులు ఉన్నారు.
అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ జోగిపేటలోని హనుమాన్ చౌర స్తా వద్ద బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎల్కతుర్తి సభకు వెళ్లే వాహనాలకు పచ్చజెండా ఊపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు జైపాల్‌రెడ్డి నియోజకవర్గ ముఖ్యనాయకులు ఉన్నారు. జహీరాబాద్‌లోని ఐబి వద్ద ఎమ్మెల్యే మాణిక్‌రావు బీఆర్ఎస్ జెండా ను ఎగురవేశారు. ఆ తర్వాత వరంగల్ సభకు వెళ్తున్న వాహనాలకు పచ్చజెండాఊపారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
పటాన్‌చెరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ జెండాను నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మెట్టుకుమార్‌యాదవ్ తదితరులు కలిసి ఎగురవేశారు. అనంతరం మైత్రిగ్రౌండ్ నుంచి వరంగల్ సభకు వెళ్తున్న వాహనాలకు బీఆర్ఎస్ నేత ఆదర్శ్‌రెడ్డి తదితరులు పచ్చజెండా ఊపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మెట్టుకుమార్‌యాదవ్, సింధు ఆదర్శ్‌రెడ్డి, నాయకులు గడీల శ్రీకాంత్‌గౌడ్, వెంకటేశంగౌడ్, శ్రీధర్‌చారి తదితరులు ఉన్నారు. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నిజాంపేట వద్ద బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వరంగల్ సభకు బయలుదేరి వెళ్లారు.