24 గంటల కరెంట్‌తో..పరిశ్రమలకు జీవం
బీఆర్ఎస్ పాలనలో కోటికాంతుల్లో తెలంగాణ వెలిగిపోతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చిన సీఎం కేసీఆర్
- 24గంటల విద్యుత్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- పారిశ్రామిక ప్రగతికి పాటుపడతాం
- బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో కోటికాంతులు
- కాంగ్రెస్ పాలనంతా అంధకారం.. అవస్థలు
- పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
- మద్దతు తెలిపిన పారిశ్రామికవేత్తలు
పటాన్చెరు, నవంబర్ 4: బీఆర్ఎస్ పాలనలో కోటికాంతుల్లో తెలంగాణ వెలిగిపోతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్కు ఏకగీవ్రంగా మద్దతు ఇస్తున్నామని వారు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలనలో పారిశ్రామికవాడల్లో వారంలో మూడు రోజుల విద్యుత్ కోతలు ఉండేవన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సమగ్ర విద్యుత్ సరఫరా విధానంతో పరిశ్రమలకు 24గంటల నాణ్యమైన విద్యుత్ లభిస్తున్నట్లు తెలిపారు. నిరంతర విద్యుత్‌తో కార్మికులకు మూడు షిప్టుల ఉపాధి లభిస్తున్నదన్నారు. లంచాల ప్రసక్తి లేకుండా టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు 15రోజుల్లో సులభంగా ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలు ఇప్పుడు కళకళలాడుతున్నాయని చెప్పారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్మికులు, పారిశ్రామికవేత్తలు, సిబ్బంది బీఆర్ఎస్కు మద్దతుగా ఉంటామనడం సంతోషాన్ని కల్గిస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మీ ఆశీస్సులుంటే మూడోమారు గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నగేశ్, శ్రీధర్‌చారి, అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్‌రావు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

