తెలంగాణ ప్రత్యేక
రాష్ట్రమైతే ఆగమే అనె..
తెలంగాణ రాష్ట్రమంత
అంధకారమైతదనె…
తెలంగాణ వేరుపడితే
నీళ్లు లేక సచ్చుడే అనె
తెలంగాణ ప్రాంతమంత
ఎడారి అయిపోతదనె..
నక్సలిజం పెరుగుతుందనె
పరిశ్రమలు ఇక రావనె
మతచిచ్చులు రేగుతాయనె
మరణహోమం జరుగుతుందనె
ఉద్యోగాలు రావు అనె
ఆత్మహత్యలాగవనె..
సీమాంధ్రులు తెలంగాణలో
బతుకుట ఇక దుర్లభమనె
శాంతిభద్రతలు క్షీణించి
సమస్యలతో సతమతమనె&
తెలంగాణ నాయకులకు
పాలించుడే రాదు అనె
తెలంగాణ రైతులకు
పండించుడే తెల్వదనె..
ఎన్నో అనె ఎన్నెన్నో అనె
వాళ్లు అన్నట్లు..
అనుకున్నట్లు జరిగినాదా ఒక్కటైనా..
ఉద్యమ నాయకుడే
పరిపాలకుడైన వేళ
దిక్కులేకుండా పోతుందనుకున్న తెలంగాణ
ఇవాళ దేశానికే దిక్సూచి అయ్యింది..
రచన: కవి శ్రీనివాస్‌గౌడ్
(మంజీరా రచయితల
సంఘం సభ్యుడు) మెదక్