KPHB Colony | ’50 లక్షలు ఇవ్వాలని నన్ను గన్‌తో బెదిరిస్తున్నారు’.. కాంగ్రెస్ నేతలపై యువనేత ఫిర్యాదు..!
కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 6 : కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నేతలపై యువ నేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లైసెన్స్డ్ గన్‌తో తనను బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని అతడు పోలీసులను ఆశ్రయించాడు.
కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 6 : కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నేతలపై యువ నేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేపీహెచ్‌బీ కాలనీలో నివసించే కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి (మాజీ) గాలి బాలాజీ, బాలాజీనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్, కాంగ్రెస్ నాయకులు నాగమల్లేశ్వర్రావులు లైసెన్స్డ్ గన్‌తో తనను బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని అతడు పోలీసులను ఆశ్రయించాడు.
కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో నివాసం ఉండే ముత్తిరెడ్డి ఫణీంద్ర అలియాస్ పీఆర్నాయుడు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వినర్‌గా పనిచేస్తున్నాడు ఫణీంద్ర. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి (మాజీ) గాలి బాలాజీ, బాలాజీనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్, కాంగ్రెస్ నాయకులు నాగమల్లేశ్వర్రావు, దుర్గాప్రసాద్, రాము, ఖధీర్.. తనను బెదిరిస్తున్నారని ఆదివారం పోలీసులకు ఫణీంద్ర ఫిర్యాదు చేశాడు.
రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ మద్దతు) ఉందని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో పరిచయం ఉందని గాలి బాలాజీ స్థానికంగా చట్టవిరుద్దమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్నాని అతడు తెలిపాడు. కూకట్‌పల్లిలో సర్వే నెంబర్ 141లో భూమిని బాలజీ కజ్జా చేశారని, బిల్డర్ల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని ఫణీంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాలాజీ బృందం చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సహకరించడం లేదని తనపై అక్రమంగా కేసులు పెడుతూ.. బెదిరిపంపులకు పాల్పడుతున్నారని ఫణీంద్ర పోలీసులకు చెప్పాడు.
సెప్టెంబర్ 2వ తేదీన ఓ హోటల్లో గాలి బాలాజీకి చెందిన లైసెన్స్డ్ గన్‌తో నాగమల్లేశ్వర్రావు, రాజేష్‌లు బెదిరింపులకు పాల్పడ్డరని, రూ. 50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని అతడు తెలిపాడు. బాలాజీ టీమ్ సభ్యులంతా పలుమార్లు సెల్ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఫణీంద్ర కోరాడు. పైన పేర్కొన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్‌కు, పోలీస్ ఉన్నతాధికారులకు ఫోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్టు భాధితుడు ఫణీంద్ర తెలిపాడు. అయితే.. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని కేపీహెచ్‌బీ కాలనీ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

