Nurse Murder : హైదరాబాద్ శివారు తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటలో పనిచేసే నర్సు హత్యాచారానికి గురైన ఘటనను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా మేజిస్టీరియల్ విచారణ జరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, సంబంధిత సంస్థ నిర్వహణలో ఏవైనా నిర్లక్ష్యాలు ఉన్నాయా? మహిళా ఉద్యోగుల భద్రత విషయంలో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా? అనే అంశాలన్నింటినీ విచారణలో పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నర్సు శిరీష హత్య కేసులో ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నందున అత్యంత పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని.. సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి కేసు విచారణలో జాప్యం లేకుండా చూడాలని ఆయన సూచించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఉకే. శిరీష తుక్కుగూలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేది. విధులు పూర్తయ్యాక సిబ్బందికి కేటాయించిన గదిలోనే తను ఉండేది. అయితే.. ఆగస్టు 28వ తేదీన సనాఉల్లాహ్ ఖాన్(బిహార్) అనే బైక్ మెకానిక్ ఆమె గదిలోకి చొరబడ్డాడు. కిటికీ గుండా లోపలికి వచ్చిన అతడు ఒంటిరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు నిందితుడు. శిరీష హత్య కేసును సవాల్‌గా తీసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు, శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ ఫుటేజీని, సాంకేతిక ఆధారాలతో సనాఉల్లాహ్ ఖాన్‌ను ఆగస్టు30 న అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ హాస్పిటల్లో నర్సు హత్యాచారానికి గురైన ఘటనను ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
✅ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా… pic.twitter.com/FzONNFnKqw
— Telangana CMO (@TelanganaCMO) September 6, 2026