మెదక్ మున్సిపాలిటీ/ కొల్చారం/ చేగుంట/ చిలిపిచెడ్/ నిజాంపేట/ మనోహరాబాద్, జనవరి 14 : సంక్రాంతి పుర స్కరించుకొని జిల్లావ్యాప్తంగా మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. జిల్లాకేంద్రం మెదక్ పట్టణంలోని 24వ వార్డులో కౌన్సిలర్ చోళ మేఘమాల ఆధ్వర్యంలో శని వారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేత లకు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ బహుమతులు అంద జేశారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సవితారాణి, ఉమారాణి తదితరులు వ్యవహరించారు.
తెలంగాణ సంస్కృతి గొప్పది : సర్పంచ్ ఉమ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పదని కొల్చా రం మండలకేంద్రం సర్పంచ్ కరెంటు ఉమారాజాగౌడ్ పేర్కొ న్నారు. కొల్చారంలో ఛత్రపతి యువజన సంఘం ఆధ్వర్యం లో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నింగోల్ల చెన్నయ్య, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంటు రాజాగౌడ్, కారోబార్ వడ్ల ప్రభాకర్, యువజన సంఘం అధ్యక్షుడు చౌరిగారి ప్రేమ్, ఉపాధ్యక్షుడు పిట్ల క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
వడియారంలో సంక్రాంతి క్రీడాపోటీలు…
క్రీడల్లో యువత ముందుండాలని ఎంపీటీసీ బక్కి లక్ష్మీ రమేశ్ పేర్కొన్నారు. చేగుంట మండలంలోని వడియారం గ్రా మంలో ఎంపీటీసీ బక్కి లక్ష్మీరమేశ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. రెండు రోజులపాటు గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహి స్తున్నారు. కార్యక్రమంలో నాయకులు అంకన్నగారి వెంకట్‌గౌడ్, బాలయ్య పాల్గొన్నారు.
క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేత
క్రీడాస్ఫూర్తితో యువత పో టీపడాలని చిలిపిచెడ్ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి పేర్కొ న్నారు. మండలకేంద్రం చిలిపిచెడ్‌లో నారన్నగారి చిలకమ్మ జ్ఞాపకార్థం యువకులకు క్రికెట్ కిట్ అందజేశారు.
క్రీడాకారులకు అభినందనలు
యువజన దినోత్సవం సందర్భంగా రామాయంపేటలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామానికి చెందిన క్రీడాకారులు క్రికెట్ కప్ గెలుచుకున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద క్రీడాకారులను ఎంపీపీ సిద్ధిరాములు సన్మా నించారు. యువత చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని, ఇందుకు తనవంతుగా సాయం చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత, గ్రామస్తులు లింగంగౌడ్, రాజు, ఎల్లం తదితరులు ఉన్నారు.
విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేత
మనోహరాబాద్‌లో జరిగిన కరాటే పోటీల్లో గెలుపొందిన టీం సభ్యులను జడ్పీచైర్‌పర్సన్ హేమలతాగౌడ్ ప్రశంసాపత్రా లను అందజేశారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ డైరెక్టర్ భిక్ష పతి, స్థానిక నాయకులు సాయిరాంగౌడ్, బండి నరేందర్, కరాటే మాస్టర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.