పెద్దశంకరంపేట, అక్టోబర్ 14: కేసీఆర్, హరీశ్‌రావు సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమ కెరటం మాజీ జడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు(45) ఆదివారం హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉద్యమంలో మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా సేవలందించాడు.
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా బీఆర్ఎస్ అధిష్టానం జడ్పీటీసీ టికెట్ ఇవ్వడంతో జడ్పీటీసీగా గెలుపొందారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల పెద్దశంకరంపేటలో వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఆయన స్వస్థలం పెద్దశంకరంపేట మండలం మల్కాపురం గ్రామం, గతంలో మల్కాపురం గ్రామసర్పంచ్‌గా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా, జడ్పీటీసీగా పనిచేశారు. మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావుతోపాటు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కార్యకర్తలకు అందుబాటులోఉంటూ మంచిపేరు తెచ్చుకున్నారు.