నర్సాపూర్,మే2 : ధాన్యాన్ని త్వరగా రైస్‌మిల్లులలో అన్లోడ్ చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ రైస్‌మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలో సాయికృష్ణ రైస్‌మిల్లును సందర్శించారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని లారీలలో లోడ్ చేసి రైస్‌మిల్లులకు త్వరగా పంపించాలని, ఎలాంటి ఆలస్యం జరుగకుండా చూసుకోవాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. దళారుల మాటలు నమ్మి పోసవొద్దన్నారు. తహసీల్దార్ వెంట ఆర్ఐ ఫైజల్, సిబ్బంది తదితరులు ఉన్నారు.