సిద్దిపేట టౌన్, జూన్ 15: తైక్వాండోలో జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని తైక్వాండో అసోసియేషన్ సిద్దిపేట జిల్లా గౌరవ అధ్యక్షుడు వేలేటి రాధాకృష్ణ శర్మ పిలుపునిచ్చారు. తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటలోని ఐఎంఏ హాల్లో తైక్వాండో బెల్ట్ల ప్రమోషన్ టెస్ట్ నిర్వహించారు. 60 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.
ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ శర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కలర్ బెల్టులు, ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆత్మరక్షణకు విద్యార్థులు తైక్వాండో నేర్చుకోవాలని సూచించారు. డీవైఎస్వో వెంకట నరసయ్య, రూరల్ సీఐ శ్రీనివాస్, వైద్యురాలు ప్రణీత, తైక్వాండో కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. విద్య, ఉద్యోగాల్లో 2శాతం స్పోర్ట్స్ కోటా లభిస్తున్న ట్లు తెలిపారు. విద్యార్థులు క్రీడలు ఆడేలా తల్లిదంద్రులు, గురువులు ప్రోత్సహించాలని సూచించారు.