Bribe | వెల్దుర్తి, డిసెంబర్ 3 : ఓ రైతు తన భూమి సర్వే చేయాలని స్థానిక సర్వేయర్‌ను కలిశాడు. అయితే సర్వే చేయాలంటే డబ్బులు ఖర్చవుతాయని సదరు సర్వేయర్ ఆ రైతుకు చెప్పాడు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులకు సమాచారం అందించి డబ్బులు డిమాండ్ చేసిన సర్వేయర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు.
వెల్దుర్తి మండల తహసీల్దార్ కార్యాలయ సర్వేయర్ శ్రీనివాస్ భూ సర్వే కోసం రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిసిన వివరాల ప్రకారం వెల్దుర్తికి చెందిన రైతు తన ఎకరం 20 గుంటల భూమి సర్వే చేయడం కోసం సంబంధిత సర్వేయర్‌ను కలిశాడు.
అయితే భూమిని డిజిటల్ సర్వే చేయాలని ఇందుకోసం రూ.20 వేలు ఖర్చు అవుతుందని సర్వేయర్ సంబంధిత రైతుకు తెలియజేశాడు. దీంతో రైతు డబ్బులను బుధవారం సర్వేయర్‌కు ఇస్తుండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచగొండి సర్వేయర్‌ను పట్టుకున్నారు.
Mahabubabad | లారీని ఢీ కొన్న బైక్.. రైల్వే ఉద్యోగి మృతి
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా