చిలిపిచెడ్, జూన్ 29: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా మెరుగైన విద్య అందించాలనే ప్రీప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూర్, గౌతాపూర్, ఫైజాబాద్, గంగారం గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రీప్రైమరీ పాఠశాలలను ఆమె ప్రారంభించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాప్ గురించి రైతులకు అర్థంకాక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.యాప్ ద్వారా బుకింగ్ చేసుకుందామనే వరకు కొందరికి ఇంటర్నెట్ రాక, మరికొందరికి అర్థం కాక, ఇంకా కొంతమంది బుక్ చేసుకునేలోపే యాప్‌లో ఉన్న బస్తాలు స్టాక్ అయిపోయి సున్నా కనబడడంతో రైతులు నిరాశకు గురవుతున్నారన్నారు. యూరియా మళ్లీ ఎప్పుడు దొరకుతుందోనని రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యాప్‌ను రద్దుచేయకుంటే రోడ్లపై ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, చిలిపిచెడ్ ఎంఈవో విఠల్, ఎంపీడీవో ప్రశాంత్, ఏపీవో శ్యామ్‌కుమార్, ఐసీడీసీ మండల సూపర్వైజర్ సంతోషిమాత, ఆయా గ్రామాల సర్పంచ్‌లు దాసరి శేషాద్రి, బలవంత్‌రెడ్డి, రామయ్య, సుధీర్‌రెడ్డి, అనిల్, ఉప సర్పంచ్‌లు వెంకటేశం, శ్రీకాంత్ రెడ్డి, శ్రీరాములు, పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, బెస్త లక్ష్మణ్, వెంకట్‌రెడ్డి, రాజ్‌కుమార్, గోపాల్, ఖాసీం, విజయకుమార్ పాల్గొన్నారు.