నర్సాపూర్, మార్చి 8: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శనివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శనివారం నర్సాపూర్‌లో స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని శాలువాతో సత్కరించారు. సాయంత్రం నర్సాపూర్ చేరుకున్న హరీశ్‌రావు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మాజీ మెంబర్ మన్సూర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.