గ్రామాల అభివృద్ధికి కృషి
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లి రైతు వేదికలో అధికారులు నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు సమస్యలను మండల సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
- నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
- మెదక్ జిల్లా కౌడిపల్లి సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే
కౌడిపల్లి, ఆగస్టు 13: గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లి రైతు వేదికలో అధికారులు నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు సమస్యలను మండల సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల అధికారులు సమస్యలు పరిష్కరించాలని, లేదంటే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రానివారికి మెమో జారీచేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. యూరి యా సకాలంలో అందించాలని, యాప్ తో రైతులకు నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదన్నారు. వ్యవసా యం, విద్యుత్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. సమావేశంలో డీఎల్పీవో సురేశ్బాబు, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ,ఆయా గ్రామాల సర్పంచ్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

