మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 4: గ్రంథాలయాలను సరస్వతీ మాతగా గౌరవించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా సుహాసినిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రితోపాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుహాసినిరెడ్డితో రియాజ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విద్యావంతులు కావడానికి.. విద్యావంతమైన సమాజానికి ప్రధాన పాత్ర పోషించేది గ్రంథాలయాలేనన్నారు.
పుస్తకంతోనే సమాజ మార్పు సంతరించుకుంటుందన్నారు. ప్రతిఒక్కరి జీవితంలో ముందుకు నడిపేది పుస్తకం మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు.ప్రతిఒక్కరూ గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివి విద్యావంతులు కావాలని ఆకాక్షించారు. పిల్లలు విద్యావంతులు కావడం ఎంత ముఖ్యమో సంస్కారవంతులు కావ డం సైతం అంతే ముఖ్యమన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ సరస్వతీ పుత్రుడు కావాలన్నదే నా తపన అన్నారు. గ్రంథాలయాల్లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లా గ్రంథాలయానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
అంతకుముందు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ తదితరులు మాట్లాడారు. గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన సుహాసినిరెడ్డిని మంత్రితో పాటు పలువురు సత్కరించి శుభాకాంక్షలు తెలిపా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ, డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు, ము న్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, సుప్రబాత్‌రావు పాల్గొన్నారు.