ఇంటింటి ఎన్యుమరేషన్ సక్సెస్ చేయాలి
ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన ఇంటింటి ఎన్యుమరేషన్‌పై సమీక్షించారు.
- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 8: ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన ఇంటింటి ఎన్యుమరేషన్‌పై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి అవసరమైన వివరాలు సేకరించడంతో పాటు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి తిరిగి స్వీకరించాలని పేర్కొన్నారు. తెలంగాణలో 2002 తర్వాత తిరిగి ఇప్పుడు సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం తప్పులు లేని, నవీకరించిన ఓటరు జాబితా ఎంతో ముఖ్యమన్నారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.వీడియోకాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఆర్డీవో రాజేందర్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

