తొగుట, ఏప్రిల్ 30: ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులకు అరిగోస తప్పడం లేదని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విమర్శించారు. తొగుట వ్యవసాయ మార్కెట్లో 15 రోజులుగా పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు నత్త నడకనసాగడంపై తొగుట మార్కెట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నల్ల జెండాలు ధరిం చి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట అమలుకాని హామీలు ఇచ్చి మో సం చేశారన్నారు.
నాడు కేసీఆర్ హయాంలో పంట కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక ఉండేదన్నారు. తొగుట మార్కెట్ లో 4900 క్వింటా ళ్ల పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు చేసినా ఒక్కపైసా రైతులకు రాలేదన్నారు. మార్కెట్లో 15 రోజులుగా 50 టన్నుల వరకు పొద్దు తిరుగుడు ధాన్యం పేరుకుపోయిందని, కేంద్రం టార్గెట్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. మార్కెట్‌కు ధాన్యం తీసుకువస్తే గేట్‌కు తాళం వేయడమే ప్రజాపాలనా అని మాజీ సహకార సంఘం చైర్మన్ హరికృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. రాస్తారోకో వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఎస్సై రవికాంత్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనను విరమింపజేశారు. అనంతరం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. సర్పంచ్‌లు రాజిరెడ్డి, బక్క కనకయ్య, నాయకులు సిలివేరి మల్లారెడ్డి, వేల్పుల స్వామిముదిరాజ్, దోమల కొమురయ్య, సూతారి రమేశ్, కుర్మ యాదగిరి, నరేందర్‌గౌడ్, మాదాసు అరుణ్‌కుమార్, రడం భాస్కర్‌గౌడ్, ఎల్లం, మంగ నరిసింహులు, అంజ య్య, భిక్కనూరు శ్రీశైలం, మంగ యాదగిరి, అనిల్‌కుమార్, మాదారం ప్రశాంత్, బోయిని శ్రీనివాస్, భూపాల్‌రెడ్డి, సుతారి రాంబాబు, బిక్కనూరి సంతోష్, మహ్మద్ జహంగీర్, పరశురాములు, నాగయ్య,మల్లేశం పాల్గ్గొన్నారు.