మెదక్ అర్బన్,మే08 : జూన్ 14వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో రాజీపడదగ్గ కేసులను ఎక్కువ సంఖ్యలో పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి శుభవల్లి అన్నారు. గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ మేనేజర్స్తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ…రాజీ మార్గమే రాజమార్గమని, పోలీసులు సమన్వయంతో పనిచేసి ఎక్కువ సంఖ్యలో కేసులు లోక్ అదాలత్లో పరిష్కరమయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రజలు, కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి సిరిసౌజన్య, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.