తూప్రాన్, నవంబర్ 5: కళాశాలల సమయానికి బస్సులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, సమయానుకూలంగా నడపాలని కళాశాల విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. మంగళవారం తూప్రాన్ మండలంలోని ఘనపూర్ బస్‌స్టేజీ వద్ద బస్సులు రాకపోవడంతో ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యుడు జగన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఉదయం 9గంటలకు కళాశాలకు వెళ్లాల్సినా, బస్సులు పదిన్నర గంటలకు వేస్తున్నారని, అవికూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. అధికారులు స్పందించి సమయానికి బస్సులు నడిపించాలని డిమాండ్ చేశారు.
గజ్వేల్, నవంబర్ 5: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని పుణ్యక్షేత్ర దర్శనాలు, విహారయాత్రలు, వివాహాలకు అద్దె ప్రాతిపదికన తిప్పే ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించినట్లు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ప్రస్తు తం పల్లెవెలుగు బస్సులకు రూ.11, ఎక్స్‌ప్రెస్‌పై రూ.7, డీలక్స్‌పై రూ.8, సూపర్ లగ్జరీపై రూ.6 చొప్పున చార్జీలను తగ్గించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.