Stree Nidhi Loans | రామాయంపేట, జూలై 10 : శ్రీనిధి రుణాల ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ది చెందుతున్నారని ఐకేపీ సీసీ చెన్నమ్మ, వీవోఏ లీడర్ లు శ్యామల, మనీష, మహేశ్వరిలు పేర్కొన్నారు. గురువారం రామాయంపేట మండలం కాట్రియాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సెర్ఫ్ శాఖ ఏర్పడి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్బంగా సెర్ప్ ద్వారానే మహిళలు ఆర్థికాభివృద్ది చెందుతున్నారని స్వీట్లు పంచుకుంటు సంబురాలు జరిపారు.
అనంతరం సీసీ చెన్నమ్మ మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా శ్రీనిధి బ్యాంకు ఎంతో సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. నేడు మహిళలు ఆర్థికాభివృద్ది చెందారంటే అది కేవలం సెర్ఫ్ శాఖతోనేనని అన్నారు. బ్యాంకులు ఇస్తున్న శ్రీనిధి రుణాలను మహిళా సంఘాలు గ్రామాలలో సద్వినియోగం చేసుకుని.. ప్రతి నెలనెల సక్రమంగా డబ్బులను బ్యాంకులలో వీవోఏ లీడర్లు చెల్లించాలన్నారు.
బ్యాంకులో సక్రమంగా రుణాలు రీ షెడ్యూల్ అయితేనే ఆ సంఘానికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. సక్రమంగా రుణాలు చెల్లించిన సంఘాలకు బ్యాంకు ద్వారా ప్రత్యేకంగా రుణాలు అందిస్తున్నారని తెలిపారు.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్