సిద్దిపేట పట్టణంలో వీధికుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నా యి. రోడ్ల వెంట గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాహనదారుల మీదికి కుక్కలు దూసుకువచ్చి గాయపరుస్తున్నాయి. చిన్నలు, వృద్ధులు కుక్కల దాడి లో ఎక్కువగా గాయపడుతున్నారు.
పట్టణంలో వీధికుకలకు కు.ని.ఆపరేషన్లు చేసే కార్యాలయం మూతపడింది. దీంతో వీధికుక్కల సంఖ్య పెరిగి పట్టణంలో ఎక్కడపడితే అక్కడ గుం పులుగా తిరుగుతూ హడలెత్తిస్తున్నాయి. కొత్తవారు కనిపిస్తే దాడులకు పాల్పడుతున్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లి వచ్చేటప్పుడు ఎక్కువగా కుక్కల బారిన పడుతున్నారు.
– సిద్దిపేట స్టాఫ్ ఫొటోగ్రాఫర్, జూలై 29