Karate | మెదక్ మున్సిపాలిటీ, జూలై 20 : కరాటేతో శారీరక పటుత్వం, ఆత్మరక్షణ, మానసికోల్లాసం కలుగుతాయని రెంజుకి షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ కరాటే మాస్టార్ నగేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం మెదక్లో గుల్షణ్ క్లబ్లో షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కరాటే పరీక్షలు నిర్వహించారు.
ఈ కరాటే పరీక్షల్లో విజేతలకు నగేష్ బెల్టులు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా నగేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాలలో శిక్షణ పొంది రాణించాలన్నారు. విద్యార్థి దశలోనే తమని తామే రక్షించుకునేందుకు వారిలో ఆత్మౖస్థెర్యం పెంచేందుకు కరాటే శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టార్లు విద్యాసాగర్, దినాకర్ తదితరులు పాల్గొన్నారు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి