పటాన్చెరు, మార్చి 7: మహిళలు మీ శక్తిని గుర్తించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సహకారంతో బీఆర్ఎస్ మహిళా నాయకురాలు గూడెం యాదమ్మ, మహిళా ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళాదినోత్సవం సంబురాల్లో చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రెడ్‌క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన సీపీఆర్ శిక్షణలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి టైనర్స్ చూపించిన విధంగా బొమ్మలపై సీపీఆర్ నిర్వహించారు. భారీగా హాజరైన మహిళలకు ఇంట్లో ఎవరికి హార్ట్ ఎటాక్ వచ్చినా కాపాడేవిధంగా ఈ శిక్షణ కొనసాగిం ది. అనంతరం విద్యార్థులు, మహిళలు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలను సునీతా లక్ష్మారెడ్డి పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను గౌరవించే సంప్రదాయమున్న దేశం మనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నాదన్నారు.
సీఎం కేసీఆర్ మహిళలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ర్యాగింగ్ చేసిన, ఈవ్ టీజీంగ్కు పాల్పడినా కఠిన చర్యలుంటాయని తెలిపారు. గృహహింస చట్టం, పోక్సో చట్టాలతోనూ మహిళలకు, బాలికలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు. సైబర్ క్రైం పెరిగిందని, స్మార్ట్ ఫోన్లలతోనూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అనేక సంక్షేమ పథకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఉందన్నారు. సఖీ సెంటర్లు, షీ టీమ్స్ మీ రక్షణకే పెట్టామన్నారు. గంగా, గోదావరి, కావేరి, సరస్వతీ, యమున వంటి నదులకు మహిళల పేర్లే పెట్టుకున్న సంస్కృతి మనదని గుర్తు చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మలు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. సీపీఆర్ శిక్షణ మహిళలకు ఎంతో అవసరం అన్నారు. ఏ కార్యక్రమం చేయాలన్నా పటాన్చెరు ముందుగా గుర్తుకు వస్తున్నదని చెప్పారు. మహిళల రక్షణకు, వారి అభివృద్ధికి మహిళా కమిషన్ పాటుపడుతుందని హామీనిచ్చారు.
స్త్రీ నిధి చెక్కు అందజేత
పటాన్చెరు నియోజకవర్గంలోని 2,469 మహిళా సంఘాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి రూ.42.53 కోట్ల స్త్రీ నిధి రుణాల చెక్కును ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మహిళా సంఘాల నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల పక్షపాతి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నదన్నారు. నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.226 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. పోలీసు నియామకాల సందర్భంగా జీఎంఆర్ పోలీస్ ట్రైనింగ్ శిక్షణ కేంద్రం ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణతో వందలాది యువతులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళా అన్నిరంగాల్లో ఎదగాలని కోరారు. జిల్లా అదనపు ఎస్పీ ఉమా విశ్వనాథ్ మాట్లాడుతూ మహిళలకు పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. చట్టపరంగా 24గంటలు మీకు అండగా ఉంటామని హామీనిచ్చారు.
ఈ సందర్భంగా క్రీడాపోటీల్లో పాల్గొ న్న మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ, కోడలు డాక్టర్ కిరణ్మయి విష్ణువర్ధన్‌రెడ్డి, ఇన్చార్జి డీఈవో విజయ మాట్లాడారు. డీఎస్పీ భీమ్‌రెడ్డి, ఎంపీపీలు సుష్మా శ్రీవేణుగోపాల్రెడ్డి, ప్రవీణ వినయ్ భాస్కర్‌రెడ్డి, ఈర్ల దేవానంద్, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు రోజా కొలన్బాల్రెడ్డి, లలితాసోమిరెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, సింధూ ఆదర్శ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్నా శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశంగౌడ్, ఆదర్శ్‌రెడ్డి, తులసిరెడ్డి, చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, గాయత్రి పాండు, శ్రీశైలంయాదవ్, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, మెరాజ్‌ఖాన్, పార్టీ మండలాధ్యక్షుడు బీ పాండు, ఎంపీటీసీలు నీనా చంద్రశేఖర్‌రెడ్డి, నాగజ్యోతి గోల్కొండ లక్ష్మణ్, మెట్టు రమాదేవి కుమార్‌యాదవ్, సర్పంచ్ సుమతి రాంచందర్, ఏపీఎం శ్రీనివాస్, ఎంఈవో పీపీ రాథోడ్, వివిధశాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మహిళా సంఘాల నేతలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.