కేంద్ర పథకాలతో పేదలకు లబ్ధి
పేదలకు లబ్ధి చేకూరేలా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. బుధవారం ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా పీఎం-సూరజ్ పోర్టల్‌ను ప్రారంభించారు.
- గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
సంగారెడ్డి, మార్చి 13(నమస్తే తెలంగాణ): పేదలకు లబ్ధి చేకూరేలా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. బుధవారం ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా పీఎం-సూరజ్ పోర్టల్‌ను ప్రారంభించారు. కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లోని కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పీఎం-సూరజ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లబ్ధిదారులతో వర్చువల్‌గా మాట్లాడారు.
సఫాయి కర్మచారి డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొని మాట్లాడుతూ ప్రధాన మంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్‌గార్ ఆధారిత్ జనకల్యాణ్ (PM-SURAJ) కార్యక్రమం ద్వారా వెనకబడిన తరగతులకు చెందిన పేదలకు సులభంగా రుణాలు లభిస్తాయని తెలిపారు.
బ్యాంకు రు ణాలతో వెనకబడిన తరగతులకు చెందిన లబ్ధిదారులు వ్యాపారాలు చేసి ఆర్థికంగా ఎదిగే అ వకాశం ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ పేదల కోసం అమలు చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షే మం కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్బీఐ సీజీఎం రాజేశ్‌కుమార్, కెనరా బ్యాంకు డీజీఎం శ్రీనివాస్‌రావు, ఐఐటీ హైదరాబాద్ డీన్ చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

