మ్మడిదల, అక్టోబర్ 1: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో ఒకప్పుడు వానపడితే మట్టి వాసన వచ్చే ది. ఇదంతా గతం. ఇప్పుడు ఈ ప్రాంతంలో రసాయన పరిశ్రమలు ఏర్పాటు కావడంతో రసాయనాల వ్యర్థాల వాసనలు వస్తున్నాయి. దీంతో ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు వీరిపై మరోపిడుగుపడేందుకు రంగం సిద్ధమవుతున్నది. దీంతో గు మ్మడిదల మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారి భయానికి, ఆందోళనకు కారణం డంపింగ్ యా ర్డు.
హైదరాబాద్ మహానగరంలో పోగయ్యే చెత్తను గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ఫ్యారానగర్ అటవీ ప్రాంతంలో 152 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సర్కారు ప్రయత్నాలు సాగిస్తోంది. దీంతో ఇప్పటికే బతుకుభారంగా బతుకుతున్న తాము చెత్తకంపుతో ఊర్లు ఖాళీ చేసి వెళ్లక తప్పదని మండలవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుమ్మడిదల మండలంలో ఉన్న 13 గ్రామాల ప్రజలు వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
ఇక్కడ కూరగాయల పంటలతో పాటు వరి, మక్క, శనగ తదితర పంటలను సాగు చేస్తారు. పండించిన కూరగాయలను హైదరాబాద్ మా ర్కెట్‌కు తరలించి విక్రయిస్తారు. పశుసంపద అధికంగా ఉండడంతో పాలు, పెరుగు వంటివి మహానగరానికి తరలించి విక్రయిస్తారు. ఇక్కడి గొల్లకుర్మలు గొర్రెలను, మేకలను మేపుతూ బతుకుదెరువు సాగిస్తారు. ఇక్కడి ప్రజలు స్వచ్ఛమైన గాలి పీలుస్తూ జీవ నం సాగించగలుగుతున్నారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే డంపింగ్‌యార్డుతో హైదరాబాద్ చెత్తను తమ ప్రాంతానికి తరలిస్తే దుర్గంధం భరించలేమని, వాతావరణ కాలుష్యం జరిగే ప్రమాదం ఉందని మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలో డంపింగ్‌యార్డు ఏర్పాటుతో అటవీప్రాంతం దెబ్బతింటుందని, వానలు పడితే చెత్త్తాచెదారం, వ్యర్థాలు వరద రూపంలో చెక్‌డ్యామ్‌కు చేరి జీవవైవిధ్యానికి తీరని నష్టం జరుగుతుందని, వన్యప్రాణి సంరక్షణకు విఘా తం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు.
సమీపంలోని చెరువులు, కుంటలు కలుషితమవుతాయని, అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గంలోని రాయచెరువు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ఈ చెరువును ట్యాంక్‌బండ్ తరహాలో సుందరీకరణ చేస్తున్నారని, అలాంటి చెరువు కంపు వాసనతో పనికి రాకుండా పోతుందని నర్సాపూర్ మున్సిపాలిటీ కూడా డంపింగ్‌యార్డు వద్దని ఏకగ్రీవ తీర్మానం చేసింది.
2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జవహర్‌నగర్‌లోని డంపింగ్‌యార్డులో ఉన్న చెత్తను వేరు చేసి విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే వ్యర్థాలను వేయడానికి గుమ్మిడిదల మండలంలోని నల్లవల్లిలో పంచాయతీ పరిధిలోని ఫ్యారానగర్ అటవీ ప్రాంతంలో 152 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే డంపింగ్‌యార్డుకు తరలించాలని ప్రయత్నాలు కొనసాగాయి. 2015లో డంపింగ్‌యార్డు ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు డంపింగ్‌యార్డు వద్దని సర్కారుకు విన్నవించారు.
అప్పటి మంత్రి హరీశ్‌రావుకు జిల్లా పరిషత్ సమావేశంలో అప్పటి జడ్పీటీసీ చిన్నపాపని కుమార్‌గౌడ్ వేడుకున్నారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మండలంలోని 13 గ్రామపంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి సర్కారుకు పంపాయి. దీంతో పదేండ్ల పాటు ఊపిరి పీలుచుకున్నారు. ఇక డంపింగ్‌యార్డు ఏర్పాటు కాదని ధీమాగా ఉన్నారు. కానీ, రేవంత్ సర్కారు తిరిగి తెరపైకి డంపింగ్ యార్డు అంశాన్ని తెచ్చింది.
అప్పట్లో డంపింగ్‌యార్డును వ్యతిరేకించిన నాయకులను ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహ పిలిపించి డంపింగ్‌యార్డు కోసం సూచనలు చేశారు. జర్మనీ టెక్నాలజీతో డంపింగ్ యార్డు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారులు వారికి తెలిపారు. కానీ, డంపింగ్‌యార్డు వద్దే వద్దని అన్నివర్గాలు మంత్రి దామోదరకు విన్నవించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు మండల నాయకులు తెలిపారు
ఫ్యారానగర్లో డంపింగ్ యార్డు ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాం. డంపింగ్‌యార్డు వద్దని మంత్రి దామోదర్ రాజనర్సింహకు, ఎంపీ ర ఘునందన్రావుకు, ఎమ్మె ల్యే మహిపాల్‌రెడ్డికి ఇటీవల వినతిపత్రాలు అందజే శాం. అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్నిపార్టీల నాయకులందరం కలిసి డంపింగ్‌యార్డు ఏర్పాటును అడ్డుకుంటాం. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఉద్యమిస్తాం.
– కుమార్ గౌడ్ మాజీ జడ్పీటీసీ, గుమ్మడ
డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెన క్కి తీసుకోవాలి. ప్రజల బతుకులు ఆగం కాకుండా చూడాలి. వ్యవసాయం, పాడి, గొర్రె,మేకలను న మ్ముకున్న పాడి రైతులను ఆగం చేయకండి. పచ్చని అడవిలో కారుచిచ్చులా డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలనుకుంటే మరో ఉద్యమమే వస్తుంది. తీవ్ర నష్టం చేకూర్చే డంపింగ్‌యార్డు ఏర్పాటును సర్కారు విరమించుకోవాలి.
-గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు, గుమ్మడిదల