మెదక్ మున్సిపాలిటీ/మెదక్‌రూరల్/రామాయంపేట/పెద్దశంకరంపేట/చేగుంట/మనోహరాబాద్/చిలిపిచెడ్/ కౌడిపల్లి/నిజాంపేట/పాపన్నపేట, ఆగస్టు 26: జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు రాధాకృష్ణ, గోపికల వేషధారణలు వేసి ఆటలాండించారు. అనంతరం ఉట్టి కొట్టించి పాటలు పాడించారు.
చిన్నారులకు తులాభారం నిర్వహించి పండ్లు, తులసీ దళాలతో తూకం వేశారు. కొన్ని ప్రాంతా ల్లో శోభాయాత్ర నిర్వహించారు. కృష్ణుడు, గోపికలు, యశోద, అల్లూరి సీతారామరాజు, భరతమాత, భగత్‌సింగ్, శివాజీ, భీముడు, నేతాజీ సుభాష్‌చంద్రబోస్, రాణిరుద్రమ్మ, లక్ష్మీబాయి వేషధారణలు ఆకట్టుకున్నారు.