వార్షికోత్సవాలకు ముస్తాబైన చాముండేశ్వరి ఆలయం
మంజీరానది తీరాన కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. నది జలసవ్వడులు., పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం, నిత్యం దూపదీప నైవేద్యాలు, కుంకుమార్చనలు, ఒడిబియ్యం, ప్రత్యేక పర్వదినాలలో విశిష్టమైన పూజా కార్యక్రమాలతో ఈ ఆలయం వెల్లివిరుస్తున్నది.
- నేటి నుంచి మూడు రోజులు వేడుకలు
చిలిపిచెడ్, జనవరి 11: మంజీరానది తీరాన కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. నది జలసవ్వడులు., పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం, నిత్యం దూపదీప నైవేద్యాలు, కుంకుమార్చనలు, ఒడిబియ్యం, ప్రత్యేక పర్వదినాలలో విశిష్టమైన పూజా కార్యక్రమాలతో ఈ ఆలయం వెల్లివిరుస్తున్నది. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ శివారులోని మంజీరా నది తీరాన భక్తులకు దర్శనమిస్తున్న చాముండేశ్వరి అమ్మవారి గుడి భారత దేశంలోని రెండో అతిపెద్ద ఆలయం. 1979లో అమ్మవారి భక్తుడు కుళాచార్య బ్రహ్మశ్రీ వెంకటరమణయ్య ఇక్కడ స్థలాన్ని శుద్థి చేసి ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ఉత్తమ శిలలను తెప్పించి తమిళ శిల్ప కళాకారులతో 9 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చెక్కించినారు.
పద్దెనిమిది చేతులతో జ్వాలా కిరీటంతో వెలుగొందుతున్న అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ, కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. సాధారణంగా దేవాలయం పూర్తిగా నిర్మించిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. కానీ ఇక్కడ ఒక తిన్నెపై ప్రతిష్టించగా, ఆలయం వసతులు, ఇతర సౌకర్యాలతో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. అమ్మవారిని నిండుమనసుతో తలచుకొని మంజీరా నదిలో మునిగి తడిబట్టలతో శక్తి కొలది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగఢ నమ్మకం. పశ్చిమాభిముఖంగా ఉన్న అమ్మవారికి ఎదురుగా బ్రాహ్మి, వైష్ణవి, కాళీ దేవతలు కొలవు దీరారు. గర్భగుడిలో అమ్మవారికి ఒక వైపు మహిషాసురుడు, ఇంకొకవైపు సింహం ముఖాకృతిలో విగ్రహాలు ప్రతిష్టించారు. ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటలకు దేవతలకు అభిషేకాలు నిర్వహిస్తారు. ఏటా నవరాత్రులు ప్రారంభం రోజు, వార్షికోత్సవాల్లో మొదటిరోజు ఆలయ వేదపండితుల ఆధ్వర్యంలో మంజీరా నదిలో నుంచి భక్తులు కొత్త కుండలో మాత్రమే తీసుకువచ్చే నీటితో అమ్మవారికి జలాభిషేకం చేస్తారు. సంవత్సరంలో ఈ రెండు రోజుల్లోనూ వచ్చిన భక్తులందరికీ ఈ అభిషేకంలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు.
మూడు రోజుల పాటు వార్షికోత్సవాలు..
చాముండేశ్వరి అమ్మవారి ఆలయ 40వ వార్షికోత్సవాలు గురువారం నుంచి శనివారం వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి అమ్మవారికి సంపూర్ణ మహాజలాభిషేకంతో వార్షికోత్సావాలు ప్రారంభమవుతాయి. మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు జపాలు, పారాయణాలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మహాపూజ, మహానివేదన, హారతి, తీర్థప్రసాద వితరణ ఉంటుందని చాముండేశ్వరి సేవా సమితి, శక్తి మండల సభ్యులు, ప్రధాన పూజారి ప్రభాకర్శర్మ తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

